కౌన్తేయునికి వాసుదేవుడు భగవద్గీత ఎంత చక్కగా బోధించాడో చూడలేదు కాని మా సీనియర్ మాత్రం మనోహరి దయ వల్ల నాకు అంతటి భాగ్యమే కల్పించాడు. అంతటి మహద్భాగ్యం నాకు లభించేటట్టు చేసిన మనోహరికి ఏమి ఇచ్చినా సరిపోదు.
కానీ ఆ రోజు రాత్రి మాత్రం తను ఎలా ఉండవచ్చో అనే ఊహలు. మహా అయితే తనని వెనుక నుంచి ఇరవై సెకెన్లు కూడా చూసుండను. ఆయినా కొంత లీలగా గుర్తు వస్తుంది. తన నల్లని జుట్టు ఒత్తుగా ఉండి, చక్కగా రెండు పిన్నులు మధ్య ఒక జలపాతం. ఆ నల్లని జాలపాతంపై రవికిరణాభరణాలు వల్ల మెరుస్తున్నాయా అనేట్టు తెల్లని జాజిమల్లెలు. జాజిపూల సువాసనలు ఎంతటి వారినయినా ముగ్ధమనోహరులను చేస్తుంది. అలాంటిది మనోహరి జడలోని జాజులు మత్తెక్కించేయవూ. ఆ మత్తులో ఇంకొన్ని క్షణాలు అయినా ఉంటే ఎంత బాగుంటుంది కదా. చివరిలో రబ్బరుబాండు వేసుకుంది కానీ లేకపోతె కేరళకుట్టిలాగా ఇంకా బాగుండేదేమో. పాపం తనని ఎంత విమర్శించానో! అయినా నేను అస్సలు తెలియకపోయినా, నన్ను పెళ్లి చేసుకుంటానంది. ఎంత పిచ్చిది ఈ బందరు ముద్దుగుమ్మ! ఏంటో తనని ఒక్కసారయినా కలవాలనే ఆలోచనలు. ఆ ఆలోచనల నడుమ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాను.
ప్రొద్దున్నే కాలేజికి వెళ్లి నా మనస్సుని హరించిన ముగ్దమనోహరి కోసం వెతికా. విచిత్రం ఏమిటంటే అసలు మనోహరి అనే పేరుగల అమ్మాయే లేదని తెలిసింది. ఈ మాయా మనోహరి నన్ను మాయ చేసి మాయం అయిపోయింది. ఇప్పుడు మళ్లీ అర్థమైంది తను కాదు పిచ్చిది. పిచ్చివారు ఎవరో నా నోటితో మరీ విడమరిచి నేను చెప్పలేనులేండి. మీకు ఆ మాత్రం అర్థం అవుతుంది కదా!

టూ మచ్ రాసారు కద అమ్మాయి గురించి.. మీరు ఇంతలా అమ్మాయి గురించి కలలు కంటారు కలవరిస్తారు అని నాకు ఇప్పటి వరకు తెలియదు సుమా!!
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteకొందరు అంతే.. కనిపించరు.. వీడి లాగా.. వీదు పెద్ద జగజెంత్రి..ఇప్పటికైనా అర్ధం చేసుకున్నారు...
ReplyDeletemanOhari maaya nunDi tEli maa maayalOki eppuDostaaru???
ReplyDelete